న్యూఢిల్లీ, సాక్షి: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తాజాగా అమెరికాలో సైతం వినియోగించనున్న ఫైజర్ వ్యాక్సిన్‌కు దేశీయంగా చుక్కెదురుకానుంది. ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ధర 37 డాలర్లు(సుమారు రూ. 2720) కావడం దీనికి కారణమని ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్ 10 డాలర్ల(రూ. 737)కే అందుబాటులోకి రానుండటంతో కేంద్ర ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్ కొనుగోలుకి ముందుకెళ్లకపోవచ్చని తెలియజేశాయి. అధిక ధరకుతోడు.. ఫైజర్ తయారీ వ్యాక్సిన్‌ను మైనస్ 70-90 సెల్షియస్‌లో నిల్వ చేయవలసి రావడం సైతం ప్రతికూలంగా పరిణమించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వెరసి ఫైజర్ వ్యాక్సిన్ ధర, నిల్వ సమస్యలు, పంపిణీ వ్యయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలుకి విముఖత చూపనున్నట్లు ఫార్మా వర్గాలు అభిప్రాయపడ్డాయి. (అలర్జీలు ఉన్న వారికి వ్యాక్సిన్లు వాడొద్దు)
నాలుగో దేశం
ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్‌ను యూకే, బెహ్రయిన్, కెనడా అత్యవసర ప్రాతిపదికన వినియోగించేందుకు అనుమతులు మంజూరు చేశాయి. ఈ బాటలో వారాంతాన యూఎస్‌ఎఫ్‌ఎడీఏ సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో నేటి నుంచి యూఎస్‌లోనూ ఫైజర్ వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగించనున్నారు. ఫైజర్ స్వయంగా రూపొందించిన కోల్డ్ స్టోరేజీ సౌకర్యాల ద్వారా యూఎస్‌లో వ్యాక్సిన్ల పంపిణీని ఆదివారం ప్రారంభించింది. వీటిని తొలుత హెల్త్ వర్కర్లు, నర్సింగ్ హోమ్ సిబ్బంది తదితరులకు వినియోగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment