
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు దేశీ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం, యూరప్ మార్కెట్ల నష్టాల ప్రభావం ఇక్కడా పడింది. దీంతో ఈ రోజు మార్కెట్‌లో నష్టాలతో మొదలైంది. అయితే గత రెండు రోజులుగా కనిపించిన జోరు మరోసారి కొనసాగుతుందని మధ్యాహ్నం సమయాని కల్లా తిరిగి సూచీలు పుంజకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ రోజు ఉదయం 9:15 గంటలకు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఆరు పాయింట్లు నష్టపోయి 17,997 దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు బీఎస్‌ఈ సెన్సెక్స్ 53 పాయింట్లు నష్టపోయి 60,342 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment