మరో ‘కేజీఎఫ్‌’ ఆనవాలు.. ఎక్కడో తెలుసా..? | Deccan Gold Mines Subsidiary Strikes Gold Lithium In Tanzania | Sakshi
Sakshi News home page

మరో ‘కేజీఎఫ్‌’ ఆనవాలు.. ఎక్కడో తెలుసా..?

Published Fri, Mar 22 2024 8:57 AM | Last Updated on Fri, Mar 22 2024 9:39 AM

Deccan Gold Mines Subsidiary Strikes Gold Lithium In Tanzania - Sakshi

టాంజానియాలో బంగారం, లిథియం నిల్వలు ఉన్నట్లు డెక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ గుర్తించింది. దాంతో ఈస్ట్‌ఆఫ్రికాలోని టాంజానియాలో ‘కేజీఎఫ్‌’ తరహా తవ్వకాలు జరుపనున్నట్లు తెలిసింది. బంగారంతోపాటు లిథియం వంటి విలువైన ఖనిజాలను వెలికి తీయడంలో ఇదొక కీలక పరిణామమని సంస్థ తెలిపింది. 

డెక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌కు చెందిన డెక్కన్‌ గోల్డ్‌ టాంజానియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ న్జెగా-టబోరా గ్రీన్‌స్టోన్‌ పరిధిలోని పీఎల్‌ బ్లాక్‌ 11524లో ఈ నిల్వలను గుర్తించింది. అక్కడ బంగారంతోపాటు లిథియంకు చెందిన ముడిపదార్థాలు ఉన్నట్లు తేలింది. విద్యుత్‌ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీల తయారీకి లిథియం ఎంతో ముఖ్యమైనది. అంతర్జాతీయంగా విస్తరించేందుకు ఈ లిథియం నిల్వల గుర్తింపు ఎంతో ఉపయోగపడుతాయని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హనుమ ప్రసాద్‌ మొదాలి తెలిపారు.

ఇదీ చదవండి: మారుతున్న రాజకీయ ప్రచార పంథా.. సోషల్‌ మీడియా సాయమెంత..?

లిథియం, ఇతర అనుబంధ లోహాల కోసం ప్రాస్పెక్టింగ్‌ లైసెన్సు(పీఎల్‌) ఆర్డరు కోసం చూస్తున్నట్లు మోదాలి పేర్కొన్నారు. టాంజానియాలో కీలక ఖనిజాల కోసం అధ్యయనాలను కొనసాగించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా 100.49 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో లిథియం నిల్వలు ఉన్నట్లు తేలిందన్నారు. దీనికి పీఎల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. డెక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌కు ఐదు అధునాతన బంగారు గనుల ప్రాజెక్టులున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement