Elon Musk Cryptic Tweet About His Death, Says If I Die Under Mysterious Circumstances - Sakshi
Sakshi News home page

Elon Musk: ‘ఒక వేళ నేను చనిపోతే?’.. ఎలన్‌ మస్క్‌ సంచలన ట్వీట్

Published Mon, May 9 2022 12:54 PM | Last Updated on Mon, May 9 2022 1:38 PM

Elon Musk Tweet Goes Viral If I Die Under Mysterious Circumstances - Sakshi

ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ ఎప్పుడూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన ఏది చేసిన అది ఓ సంచలనంగా మారుతుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకించి పుతిన్‌కి ఎదురు నిలవడం, ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ కొనుగోలు చేయడం వంటి సంచలనాలను కూడా సునాయాసంగా చేయగల దిట్ట మస్క్‌. ఆయన పెట్టే ట్వీట్‌కు సైతం ప్రపంచ మార్కెట్లలో ఓ విలువుంటుందంటే ఆశ్చర్యం వేయక మానదు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్‌ నెట్టింట రచ్చ చేయడంతో పాటు నెటిజన్లకు షాక్‌కు గురి చేస్తోంది. ఆ ట్వీట్ వెనక ఉన్న ఆంతర్యమేమిటనే ఊహాగానాలు మొదలయ్యాయి. అసలు ఆ ట్వీట్‌లో ఏముంది?

అందులో.. ‘నేను అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే.. మీ అందరితో పరిచయం అయినందుకు సంతోషం.’ అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే ఈ ట్వీట్‌ చేయడానికి ముందు ఓ రష్యన్ అధికారి మస్క్‌కు పంపిన సందేశాన్ని ఇంగ్లీష్‌లో తర్జమా చేసి షేర్‌ చేశాడు. ఆ ట్వీట్‌లో.. ‘ఉక్రెయిన్​లోకి ఫాసిస్ట్ దళాలతో పాటు కమ్యూనికేషన్ సామగ్రిని పంపించడంలో మీ సహాయ సహకారాలతో పాటు భాగస్వామ్యం కూడా ఉందని మాకు తెలుసు. ఈ చర్యలకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని’ రాసుంది.

రష్యన్‌ అధికారి పంపిన మెసేజ్‌ అనంతరం మస్క్‌ తాను అనుమాస్పదంగా చనిపోతే అని ట్వీట్‌ చేయడం, పరోక్షంగా రష్యాను ఉద్దేశించే వ్యాఖ్యానించారా అన్న చర్చ నెట్టింట జోరుగా నడుస్తోంది. అయితే ఈ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు జోకులు వేస్తుండగా, మరికొందరు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. మిస్టర్ మస్క్ మత్తులో ఉన్నారా..? అంటూ కామెంట్ చేయగా, మరికొందరు నూతన సంస్కరణలు తీసుకురావడానికి మస్క్ బతికే ఉండాలంటూ కామెంట్‌ పెట్టారు.

చదవండి: కథ అడ్డం తిరిగింది.. రష్యన్‌ యుద్ధ నౌకను పేల్చేసిన ఉక్రెయిన్‌ ఆర్మీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement