‘పెన్షన్ స్కీమ్-1995’ కింద కనీస పింఛను పెంచాలని కార్మిక వర్గం చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో కార్మిక వర్గానికి శుభవార్త చెప్పేందుకు కేంద్రం సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. ఉద్యోగులకు మెరుగైన స్థిర పెన్షన్‌ల అందించేందుకు కొత్త ఫిక్సిడ్ పెన్షన్ పథకాన్ని తీసుకురావడానికి ఈపీఎఫ్ఓ సిద్ధమవుతోంది. కొత్త పెన్షన్ ప్లాన్‌లో ఫిక్సిడ్ పెన్షన్ మొత్తాన్ని ఎంచుకునే ఆప్షన్ ఉద్యోగికి ఉంటుంది. అయితే, మీరు కోరుకున్న పెన్షన్ కోసం ఆ మేరకు మీరు సహకారం అందించాల్సి ఉంటుంది.
స్వయం ఉపాధి పొందే వ్యక్తులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఇందులో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. జీతం, మిగిలిన సర్వీస్ ఆధారంగా పెన్షన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఉద్యోగుల పెన్షన్ స్కీం-1995 ఆప్షన్ కొరకు ఈపీఎఫ్ఓ సిద్ధమవుతోంది. ఈపీఎస్'లో ప్రస్తుతం ఉన్న మొత్తం పూర్తిగా పన్ను రహితం. అయితే, దీని కింద లభించే కనీస పెన్షన్ మొత్తాన్ని వాటాదారులు పెంచాలని తరచుగా కోరుతున్నారు. ప్రస్తుతానికి, కనీస పెన్షన్ నెలవారీ విరాళం పరిమితి రూ.1250గా ఉంది. అందుకే, ఉద్యోగులకు మరింత పెన్షన్ సదుపాయం కల్పించడానికి ఈపీఎఫ్ఓ సిద్దపడుతుంది.
ఈపీఎస్ ప్రస్తుత నియమం ఏమిటి?
ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్)లో సభ్యుడైన ప్రతి ఒక్కరూ ఈపీఎస్'లో సభ్యుడు అవుతారు. ఈపీఎస్ ప్రస్తుత నియమం ప్రకారం.. ఉద్యోగి ప్రాథమిక వేతనంలో 12% కంట్రిబ్యూషన్ పీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. ఉద్యోగి మాత్రమే కాకుండా, అంతే మొత్తం యజమాని ఖాతా నుంచి పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. కానీ, యజమాని కంట్రిబ్యూషన్ చేసే మొత్తంలో 3.67 శాతం పీఎఫ్'లో, 8.33 శాతం ఈపీఎస్'లో జమ చేస్తుంది.
(చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. ఇక ఒకే గొడుగు కిందకు రైల్వే సేవలు..!)
Comments
Please login to add a commentAdd a comment