![Gartner Says That 1 In 4 People To Spend At Least one Hour Daily In Metaverse By 2026 - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/7/circle.jpg.webp?itok=lWhV_DXg)
ఫేస్‌బుక్ సృష్టికర్త జుకర్‌బర్గ్ మరో అద్భుత ఆవిష్కరణగా చెప్పుకుంటున్న మెటావర్స్‌తో త్వరలో ప్రపంచం మారిపోనుందని చెబుతోంది ప్రముఖ రీసెర్చ్ సంస్థ గార్ట్‌నర్. మెటావర్స్తో వర్చువల్ రియాలిటీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ వంటి టెక్నాలజీ ప్రజలకు మరింత సన్నిహితం కానుంది. దీంతో వర్క్, షాపింగ్, ఎడ్యుకేషన్ ఇలా అనేక రకాల పనులు మెటావర్స్‌లోనే ఎక్కువగా జరుగుతాయంటూ గార్ట్‌నర్ అంటోంది. 2026 చివరి నాటికి భూగోళంలో ఉన్న ప్రతీ నలుగురిలో ఒకరు ప్రతీ రోజు కనీసం గంట సమయమైన మెటావర్స్‌పై గడపకతప్పదని జోస్యం చెబుతోంది.
భవిష్యత్తు మెటావర్స్‌దే అని జుకర్‌బర్గ్ నమ్మకంగా చెబుతున్నారు. ఫేస్‌బుక్ పేరును సైతం మెటాగా మార్చేశారు. వాల్‌మార్ట్ వంటి బడా సంస్థలు సైతం మెటావర్స్ టెక్నాలజీకి అనుగుణంగా తమ షాపింగ్ సెంటర్లలో మార్పులు చేస్తున్నాయి. ఈ కామర్స్ వచ్చిన తర్వాత షాపింగ్ తీరుతెన్నులు మారిపోయినట్టే మెటావర్స్ మన జీవిన విధానంలో పెను మార్పులు తేవడం ఖాయమని గార్ట్‌నర్ అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment