బంగారం ఇంతలా పెరిగితే ఇంకేం కొంటాం..! | Gold and Silver Price Today on (21 September 2024) | Sakshi
Sakshi News home page

బంగారం ఇంతలా పెరిగితే ఇంకేం కొంటాం..!

Published Sat, Sep 21 2024 11:43 AM | Last Updated on Sat, Sep 21 2024 11:53 AM

Gold and Silver Price Today on (21 September 2024)

Gold Price Today: దేశంలో బంగారం ధరలు భగ్గుమన్నాయి. వరుసగా రెండో రోజూ మరింతగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఈరోజు (సెప్టెంబర్‌ 21) ఎగిసిన ధరలతో మేలిమి, ఆర్నమెంట్‌ బంగారం రేట్లు కొత్త మార్కులకు చేరువయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.750 ఎగిసి రూ.69,600 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పుత్తడి  ఒకేసారి రూ.820 పెరిగి రూ. 75,930 లకు ఎగిసింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి.

ఇదీ చదవండి: బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కసారిగా ఎగిసిన పసిడి

దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు ఈరోజు ఆకాశానికి ఎగిశాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.750 పెరిగి రూ.69,750 లను చేరుకుంది. 24 క్యారెట్ల మేలిమి బంగాంర ధర రూ.820 ఎగిసి రూ.76,080 లను తాకింది.

వెండి ధరలూ పైకే..
దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా వరుసగా రెండో రోజూ పెరిగాయి. క్రితం రోజున కేజీకి రూ.1500 పెరిగిన సిల్వర్‌ రేట్లు ఈరోజు రూ.500 మేర దూసుకెళ్లాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.98,000లకు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement