
ఏదైనా విలువైన వస్తువు కొనాలంటే భారతీయులకు మొదటి ఎంపిక బంగారమే. పసిడి కొనుగోలు చాలా మందికి సెంటిమెంట్ కూడా. అలాంటి బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందా అని కొనుగోలుదారులు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. దేశంలో క్రితం రోజున నిలకడగా ఉన్న బంగారం ధరలు నేడు (ఆగస్టు 30) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.100 తగ్గి రూ.67,050 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.100 క్షీణించి రూ. 73,150 వద్దకు తరిగింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో పసిడి ధరలు స్వల్పంగా క్షీణించాయి.
ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరలు కాస్తంత దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.67,200, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 100 తరిగి రూ.73,300 లుగా ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ శుక్రవారం తగ్గుదల కనిపించింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.500 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.93,000 వద్దకు వచ్చింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)