Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు శనివారం (నవంబర్ 30) స్వల్పంగా తగ్గుదలను నమోదు చేశాయి. నాలుగు రోజులుగా పసిడి ధరల కదలికలో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఒక రోజు పెరుగుతూ మరొక రోజు తగ్గుతూ వస్తోంది.
బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి.
తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.100 తగ్గి రూ.71,500 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.110 క్షీణించి రూ.78,000 వద్దకు తగ్గింది.
అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలోనూ బంగారం ధరలు స్వల్పంగా క్షీణించాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.110 తగ్గి రూ.71,650 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.110 తగ్గి రూ.78,150 వద్దకు దిగొచ్చాయి.
ఇదీ చదవండి: చైనాలో భారీ బంగారు నిక్షేపం.. ఇక ఇదే టాప్!
మరోవైపు వెండి ధరలు (Silver Price Today) మాత్రం నేడు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.1,00,000 వద్ద ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment