దేశంలో బంగారం ధరలు (Gold Prices) ఆగకుండా పెరుగుతూ కొనుగోలుదారులకు దడ పుట్టిస్తున్నాయి. నేడు (February 6) వరుసగా మూడో రోజూ పసిడి ధరలు దూసుకెళ్లి హ్యాట్రిక్ కొట్టాయి. మూడు రోజుల్లోనే 10 గ్రాముల బంగారంపై దాదాపు రూ.2500 పెరిగింది. ఇప్పటికే రూ.86 వేలు దాటేసి మరో కొత్త మార్కు దిశగా దూసుకెళ్తోంది.
ఇది చదివారా? భార్య పేరు మీద డిపాజిట్.. రూ.32 వేలు వడ్డీ
బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.250 (22 క్యారెట్స్), రూ.270 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 79,300కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 86,510 వద్దకు ఎగిశాయి.
ఇతర ప్రాంతాల్లో..
దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.86,660 వద్దకు.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.79,450 వద్దకు ఎగిశాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.270, రూ.250 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.
చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ. 79,300 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.270 ఎగిసి రూ. 86,510 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.
వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి కదలిక లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,07,000 వద్ద, ఢిల్లీలో రూ. 99,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment