పండుగ సీజన్‌లో పసిడి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల బంగారం రూ. 78వేలకు చేరువలో ఉంది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MOFSL) మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు మార్కెట్‌కు మరింత లాభాలను జోడించే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించారు. అంతే కాకుండా దేశీయ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ETF), SPDR హోల్డింగ్స్‌తో పాటు దిగుమతులు, CFTC స్థానాలు మార్కెట్‌కు మద్దతునిస్తాయని ఆయన అన్నారు.
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వైఖరి, భౌగోళిక రాజకీయాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమని ఓస్వాల్ పేర్కొన్నారు. పండుగలు, వివాహ సంబంధిత శుభకార్యాలు కూడా దేశీయ డిమాండ్ మార్కెట్‌లో సెంటిమెంట్లను పెంచుతుందని వివరించారు. ఇదే విధంగా ధరలు ముందుకు సాగితే.. బంగారం ధర 86,000 (10 గ్రాములు) రూపాయలకు చేరుతుందని అన్నారు.
పండుగ సీజన్ ముగిసే వరకు బంగారం ధరలు తగ్గే అవకాశం చాలా తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది మెరుగైన రుతుపవనాలు, అధిక పంట దిగుబడులు.. గ్రామీణ ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయనున్నాయి. దిగుమతి సుంకం తగ్గింపు ప్రకటన వెలువడిన తరువాత బంగారం కొనుగోళ్లు పెరిగాయని ఆయన ఓస్వాల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment