దసరా పండుగ రోజు పసిడి ప్రియులకు శుభవార్త. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో పెరిగిన బంగారం ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి.
అక్టోబర్ 23న 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,750 గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,900గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,850 గా ఉంది.
ముంబై, బెంగుళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,600గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,750 గా కొనసాగుతోంది.
వెండి ధరల్లో సైతం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దేశీయ మార్కెట్ లో కిలో వెండి ధర ఇవాళ రూ.75,300గా ఉంది. ప్రస్తుతం, ముంబైలో కిలో వెండి ధర రూ.75,300గా ఉంది. చెన్నైలో 78,700, బెంగళూరులో 74,500, హైదరాబాద్ లో 78,700గా ఉంది. ఇక విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.78,700 గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment