న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఎల్‌ఐసీ విక్రయం(అమ్మకం)లో ఐటీ దిగ్గజం డెలాయిట్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సేవలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్‌ఐసీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు సంబంధించి ప్రభుత్వం వేగం పెంచింది. జూన్‌లో జారీ చేసిన టెండర్ల ప్రకారం ఎల్‌ఐసీ షేర్లను విక్రయించే సంస్థలను ప్రభుత్వం త్వరలోనే ఆహ్వానించనుంది.
కాగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక సంస్థల అభివృద్ధి చెందేందుకు అనేక ప్రణాళికలు రచిస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ. 2.10 లక్షల కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
చదవండి: సీనియర్ సిటిజన్లకు మరో చాన్స్
Comments
Please login to add a commentAdd a comment