దేశంలో అమల్లోకి తీసుకురాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) పాలసీకి సంబంధించి మార్గదర్శకాల కోసం ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ క్రమంలో ఆయా ఈవీల తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతుండగా టెస్లా సలహాదారు కూడా ఇందులో పాల్గొన్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది.
ఈ సమావేశంలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, కియా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, రెనాల్ట్ వంటి ప్రధాన తయారీదారుల ప్రతినిధులు ఉన్నారు. వీరితోపాటు మెర్సిడెస్ జెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి లగ్జరీ కార్ల తయారీ కంపెనీలకు చెందిన ప్రతినిధుల నుంచి ప్రభుత్వ వర్గాలు అభిప్రాయాలను సేకరించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీలోని అంశాలను ఆయా కంపెనీలకు వివరించింది.
ఇదీ చదవండి: యువ ఓటర్లకు అదిరిపోయే ఆఫర్.. భారీ రాయితీ ప్రకటించిన సంస్థ
ఏప్రిల్ 22 నుంచి ఎలొన్‌మస్క్ భారత పర్యటన ప్రారంభంకానుంది. మస్క్ తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని భావిస్తున్నారు. మస్క్‌ను కలిసేందుకు భారత్‌లోని కొన్ని అంతరిక్ష రంగ స్టార్టప్ కంపెనీలను ప్రభుత్వం ఆహ్వానించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అందులో స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, ధృవ స్పేస్ వంటి కంపెనీలున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment