భారతదేశాన్ని ప్రధాన తయారీకేంద్రంగా మార్చే లక్ష్యంతో కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే తాజాగా పన్ను మినహాయింపుతో కూడిన కొత్త ఈవీ పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. టెస్లా వంటి ప్రముఖ కంపెనీలు దేశీయంగా తయారీ చేపట్టేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. స్థానికంగా ఉత్పత్తిని పెంచడానికి, అభివృద్ధి చెందుతున్న ఈవీ రంగాన్ని ప్రోత్సహించడానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తా కథనాల ప్రకారం..రానున్న మూడు ఏళ్లలో భారత్‌లో ప్రవేశించాలనుకునే ఒక్కో కంపెనీ నుంచి దాదాపు రూ.4,143 కోట్లు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాంతో విదేశీ కంపెనీలకు కొన్ని రాయితీలివ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఎంపిక చేసిన కంపెనీ ఉత్పత్తుల దిగుమతి పన్నులను తగ్గించాలని చూస్తున్నట్లు తెలిసింది. ఈ తాజా నిర్ణయంతో టెస్లా వంటి ప్రముఖ కంపెనీలు భారత్‌లో ప్రవేశించాలనే కళ నెరవేరబోతుంది.
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈవీ వాహనాల కనిష్ట సీఐఎఫ్(కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రైట్) విలువ రూ.29లక్షలు ఉంటే ఐదేళ్ల పాటు 15% కస్టమ్స్ డ్యూటీ విధించనున్నారు. అలా అయితే తయారీదారు మూడేళ్లలో భారత్‌లో తయారీ సౌకర్యాలను నెలకొల్పాల్సి ఉంటుంది. కంపెనీలకు గరిష్టంగా రూ.6,484 కోట్ల వరకే మినహాయింపులు ఇవ్వనున్నారు. కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందం కంటే అదనంగా పెట్టుబడుల మొత్తం రూ.6,600 కోట్లు ఉంటే గరిష్టంగా 40,000 ఈవీలు, ఏటా 8,000 మించకుండా దేశంలోని అనుమతిస్తారు.
ఇదీ చదవండి: ఎన్నికల బాండ్లను భారీగా కొనుగోలు చేసిన కంపెనీలివే..
తయారీదారులు మూడు ఏళ్లలో దేశంలో తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించాలి. ఐదేళ్లలోపు కనీసం 50% దేశీయ విలువ జోడింపు (డీవీఏ) సాధించాలి. ఈ పథకానికి కంపెనీలు బ్యాంక్ గ్యారెంటీను సమర్పించాల్సి ఉంటుంది. ఇది డీవీఏ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment