ఏప్రిల్–ఆగస్ట్ మధ్య నమోదు
కీలక మార్కెట్లుగా యూరప్, యూఎస్
ఫార్ములేషన్లు, బయోలాజికల్స్‌కు డిమాండ్
కలిసొస్తున్న అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఔషధ ఎగుమతులకు యూఎస్, యూరప్ కీలక మార్కెట్లుగా నిలుస్తున్నా యి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో (ఏప్రిల్–ఆగస్ట్) ఫార్ములేషన్స్, బయోలాజికల్స్ ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 10.8% పెరిగి 9.42 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సర్జికల్ ఉత్పత్తుల ఎగుమతులు 3.3% వృద్ధితో 0.29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యా యి.
ఈ గణాంకాలను కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసింది. ఫార్మా మార్కెట్లో విశ్వసనీయమైన సరఫరాదారుగా భారత్‌కు ప్రాముఖ్యత పెరుగుతున్నట్టు ఈ డేటా స్పష్టం చేస్తోంది. ‘‘పా ర్మాస్యూటికల్ ఫార్ములేషన్స్, బయోలాజికల్ ఉత్పత్తుల్లో అంతర్జాతీయంగా భారత్ స్థానం పటిష్టమవుతోంది. అంతర్జాతీయంగా జనరిక్స్, వినూత్నమైన చికిత్సలకు డిమాండ్ పెరగడంతోపాటు, భారత్‌లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన తయారీ ఇందుకు మద్దతుగా నిలుస్తోంది’’అని వివరించింది.
వివిధ దేశాలకు ఎగుమతులు ఇలా..
→ భారత్ నుంచి ఫార్ములేషన్లు, బయోలాజికల్స్ ఉత్పత్తుల ఎగుమతుల్లో 39% అమెరికాకు వెళ్లా యి. ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు 3.69 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత కంపెనీలు అమెరికాకు షిప్ చేశాయి. అమెరికాలో జనరిక్స్, ప్రాణాలను రక్షించే ఔషధాలకు డిమాండ్ పెరుగుతుండడం కలిసొస్తోంది.
→ అమెరికా తర్వాత యూకేకు అత్యధికంగా 316.2 మిలియన్ డాలర్ల విలువైన ఫార్ములేషన్లు, బయోలాజికల్స్ ఎగుమతులు నమోదయ్యాయి. యూకే వాటా 3.4 శాతంగా ఉంది. దక్షిణాఫ్రికాకు 268 మిలియన్ డాలర్లు (2.8 శాతం), ఫ్రాన్స్‌కు 243 మిలియన్ డాలర్లు (2.6 శాతం), కెనడాకు 197 మిలియన్ డాలర్లు (2.1 శాతం) విలువ చేసే ఔషధ ఫార్ములేషన్లు, బయోలాజికల్స్ ఎగుమతయ్యాయి.
→ మధ్యప్రాచ్యంలో ఇరాక్‌కు 86.5 మిలియన్ డా లర్ల విలువ చేసే ఉత్పత్తులను భారత ఫార్మా సంస్థలు ఎగుమతి చేశాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 43.5 మిలియన్ డాలర్లతో పోలి్చతే రెట్టింపయ్యాయి.
→ నాణ్యతా ప్రమాణాలతో కూడిన భారత సర్జికల్ ఉత్పత్తులకు సైతం అంతర్జాతీ య మార్కెట్లో ఆదరణ అధికమవుతోంది. గడిచిన ఐదేళ్ల నుంచి ఎగుమతులు స్థిరంగా పెరుగుతున్నాయి. 2019–20లో 0.45 బిలియన్ డా లర్ల ఎగుమతులు నమోదు కాగా, 2023 –24లో ఇవి 0.70 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో భారత్ నుంచి ఎగుమతి అయిన సర్జికల్ ఉత్పత్తుల్లో 53 మిలియన్ డాలర్లు (18.1 శాతం) యూఎస్‌కే వెళ్లాయి. జర్మనీకి 13.5 మిలియన్ డాలర్లు (4.6 శాతం), బ్రిటన్‌కు 13.4 మిలియన్ డాలర్ల చొప్పున సర్జికల్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment