Stock Market Losses: స్టాక్ మార్కెట్లు నష్టాల పరంపరను కొనసాగిస్తున్నాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు భారీగా నష్టపోతున్నాయి. ఎప్పటి నుంచో మార్కెట్‌ను గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూసిన బేర్స్‌కు, శుక్రవారం సెషన్‌లో కలిసొచ్చింది. ఇది స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ ఫ్రైడేగా మారింది. పెరుగుతున్న ఓమిక్రాన్ (కోవిడ్-19 కొత్త రూపాంతరం) కేసులు, కొత్త రకం మహమ్మారి ప్రారంభం తర్వాత మొదటిసారిగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆశ్చర్యకరమైన రేటు పెంపు మధ్య ప్రధాన ప్రపంచ కేంద్ర బ్యాంకులు తీసుకున్న కఠినమైన వైఖరితో ప్రపంచ మార్కెట్లు అన్నీ భారీగా నష్టపోయాయి.
మొత్తంగా చెప్పాలంటే ఇన్వెస్టర్లకు గత 2 నెలల నుంచి మార్కెట్ భారీ నష్టాలను మిగిల్చింది. ముఖ్యంగా అక్టోబర్ 2021లో రికార్డు స్థాయిలను చేరుకున్నప్పటి నుంచి సూచీలు భారీగా పడిపోయాయి. ఓవర్ వాల్యుయేషన్ ఆందోళనలు, గ్లోబల్ బ్రోకరేజీల ద్వారా భారతీయ ఈక్విటీల డౌన్ గ్రేడ్,ఓమిక్రాన్ కేసుల పెరుగుదలపై భయాలు, ఫెడరల్ రిజర్వ్ ద్వారా బాండ్ ట్యాపరింగ్ ప్రారంభం, అమెరికాలో రేటు పెంపు అంచనాలు పెరగడం, స్థిరమైన ఎఫ్ఐఐ అమ్మకం, ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం వంటివి ఈ 2 నెలల్లో మార్కెట్ నష్టాల్లోకి జారుకోవడానికి కొన్ని కీలక కారణాలు.
(చదవండి: 2021లో భారత్‌లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!)
రూ.15.32 లక్షల కోట్లు సంపద ఆవిరి
నిఫ్టీ50 అక్టోబర్ 19న రికార్డు స్థాయి 18,604కి చేరుకుంది.. ఇక అప్పటి నుంచి దాదాపు 10 శాతం పడిపోయి ఇటీవల 16,782 కనిష్టాన్ని తాకింది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ తలెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్ 889 పాయింట్లు నష్టపోయి 57,011 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 263 పాయింట్లు పతనమైన 17,000 దిగువున 16,985 వద్ద నిలిచింది. పోయాయి. డిసెంబర్ 10, 2021న బిఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.267.68 లక్షల కోట్ల నుంచి డిసెంబర్ 17న రూ.259.4 లక్షల కోట్లకు పడిపోవడంతో పెట్టుబడిదారుల సంపద వారంలో రూ.8.3 లక్షల కోట్లు క్షీణించింది. గత రెండు నెలల్లో రూ.15.32 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరి అయ్యింది ఉంది.
నష్టాలు ఎందుకంటే...
ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు కఠినతర ద్రవ్య పాలసీ విధానాల అమలుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లను పెంచగా.., వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కీలకరేట్ల పెంపును ప్రారంభిస్తామని యూఎస్ ఫెడ్ ప్రకటించింది. అధిక వడ్డీ రేట్ల భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. ఈ ప్రభావం మన స్టాక్ సూచీలపై పడింది. కొత్త రకం వేరియంట్ ఒమిక్రాన్ కేసులు అంతకంతా పెరిగిపోతుండటంతో లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూ విధింపు ఆందోళనలు తెరపైకి వచ్చాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు ఒత్తిడిని పెంచాయి.
(చదవండి: ఇయర్ ఎండ్ సేల్: పలు కార్ల కొనుగోలుపై రూ. లక్ష వరకు తగ్గింపు..!)
Comments
Please login to add a commentAdd a comment