న్యూఢిల్లీ: కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సి వస్తే పరిహారం చెల్లించే స్వల్ప కాల కరోనా పాలసీలను వచ్చే ఏడాది మార్చి వరకు అందించేందుకు బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) అనుమతించింది.
కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక పాలసీలను తీసుకురావాలని గతేడాది ఐఆర్‌డీఏఐ కోరడంతో.. బీమా కంపెనీలు కరోనా రక్షక్, కరోనా కవచ్ పేరుతో పాలసీలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో కరోనా కవచ్ అన్నది ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే వ్యయాలను చెల్లిస్తుంది. కరోనా రక్షక్ ప్లాన్‌లో.. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే వాస్తవ వ్యయంతో సంబంధం లేకుండా ఎంపిక చేసుకున్న మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది.
మూడున్నర నెలలు, ఆరున్నర నెలలు, తొమ్మిదిన్నర నెలల కాలాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ పాలసీల రెన్యువల్‌కు, కొత్తగా జారీ చేసేందుకు 2022 మార్చి 31 వరకు అనుమతిస్తున్నట్టు ఐఆర్‌డీఏఐ తాజా ఆదేశాలు జారీ చేసింది.
చదవండి: Insurance Policy: ఈ పాలసీలు.. ఎంతో సులభం
Comments
Please login to add a commentAdd a comment