టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఆకాశమే హద్దుగా విస్తరిస్తోన్న డెలివరీ బిజినెస్‌పై దృష్టి సారించాలని, అవసరమైన నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కోరారు. గిగ్ ఎకానమీలో జోమాటో, స్విగ్రీ, డూన్జో ఇలా ఎన్నో కంపెనీలు వేగంగా డెలివరీ చేసేందుకు పోటీ పడుతున్నాయని, అయితే ఈ క్రమంలో డెలివరీ బాయ్ సెక్యూరిటిని ఎవరూ పట్టించుకోవడం లేదంటూ పార్లమెంటులో ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
జోమాటో, స్విగ్రీ, డూన్జో ఇలా అనేక కంపెనీలు డోర్ డెలివరీ చేస్తున్నాయి. జోమాటో అయితే ఏకంగా పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేస్తామని చెబుతున్నాయి. ఇలా చేసేప్పుడు ఆ కంపెనీలుకు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాయి. డెలివరీ బాయ్ పర్సనల్ వెహికల్స్‌ను కమర్షియల్‌గా వాడుకుంటున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని కార్తి చిదంబరం అన్నారు.
ఇక డెలివరీ బాయ్‌లను కంపెనీలు తమ ఉద్యోగులుగా పరిగణించడం లేదు. కనీసం వారికి ఇన్సురెన్సు చేయించడం లేదు. కానీ పది నిమిషాల్లె డెలివరీ అందిస్తామని చెబుతున్నాయి. ఈ వేగాన్ని అందుకునే క్రమంలో డెలివరి బాయ్స్ ప్రమాదాలకు గురైతే బాధ్యత ఎవరూ తీసుకోవడం లేదు. ఎంతోమంది డెలివరి బాయ్స్ ఎటువంటి రక్షణ లేకుండా పని చేస్తున్నారు.
This is absurd! It’s going to put undue pressure on the delivery personnel, who are not employees & who have no benefits or security, who have no bargaining power with @zomato I have raised this in Parliament & have written to the Govt. Will pursue this further. https://t.co/fH8yflloiY pic.twitter.com/PfQIe2nfR4
— Karti P Chidambaram (@KartiPC) March 21, 2022
టెక్నాలజీ రావడంతో గిగ్ ఎకానమీ ఊపందుకుంది. ఈ స్వింగ్‌ని ఇలా కొనసాగిస్తూనే డెలివరీ బాయ్స్ రక్షణ విషయంలో, వారి హక్కుల విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలి. డెలివరీ సంస్థలకు కచ్చితమైన నియమ నిబంధనలు జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..! ఇకపై పది నిమిషాల్లోనే డెలివరీ..ముందుగా అక్కడే
Comments
Please login to add a commentAdd a comment