న్యూఢిల్లీ: రియల్టీ కంపెనీ మ్యాక్రోటెక్ డెవలపర్స్ రానున్న 5–7ఏళ్లలో 50 కోట్ల డాలర్లు(రూ. 3,950 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. సస్టెయినబిలిటీ చర్యల్లో భాగంగా అన్ని ప్రాజెక్టులపైనా నిధులను వెచ్చించనున్నట్లు లోధా బ్రాండుతో రియల్టీ ఆస్తులను విక్రయించే కంపెనీ తెలియజేసింది.
తద్వారా 2035కల్లా కర్బనరహిత కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించింది. నవీ ముంబై దగ్గర్లోని పాలవ సిటీ సమీకృత టౌన్‌షిప్ ప్రాజెక్టుకు ఆర్‌ఎంఐ నుంచి సాంకేతిక మద్దతును తీసుకుంటున్నట్లు పేర్కొంది. 4,500 ఎకరాలలలో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టును‘ లోధా నెట్ జీరో అర్బన్ యాక్సిలేటర్ ప్రోగ్రామ్’కింద ప్రకటించింది
Comments
Please login to add a commentAdd a comment