అమ్మకాల దెబ్బ- మార్కెట్లు బేర్‌ | Market plunges on heavy selling in blue chip stocks | Sakshi
Sakshi News home page

అమ్మకాల దెబ్బ- మార్కెట్లు బేర్‌

Published Mon, Oct 26 2020 4:05 PM | Last Updated on Mon, Oct 26 2020 4:08 PM

Market plunges on heavy selling in blue chip stocks - Sakshi

తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇ‍వ్వడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 540 పాయింట్లు కోల్పోయి 40,145 వద్ద ముగిసింది. నిఫ్టీ 162 పాయింట్లకు నీళ్లొదులుకుని 11,768 వద్ద నిలిచింది. మిడ్‌సెషన్‌కల్లా అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ 40,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. 39,,948ను తాకింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో సాధించిన 40,724 పాయింట్లే ఇంట్రాడే గరిష్టంకాగా.. నిఫ్టీ సైతం ఒక దశలో 11,712 పాయింట్ల దిగువకు చేరింది. తొలుత 11,943 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టం నమోదైంది. ఫ్యూచర్‌ గ్రూప్‌, ఆర్‌ఐఎల్‌ డీల్‌కు చెక్‌ పడటం, గురువారం ఎఫ్‌అండ్‌వో ముగింపు వంటి అంశాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు.

అమ్మకాల తీవ్రత
ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ మినహా మిగిలిన రంగాలన్నీ 3.5-1 శాతం మధ్య డీలాపడ్డాయి. ప్రధానంగా మెటల్‌, ఆటో, మీడియా, రియల్టీ 3.5-2 శాతం మధ్య నష్టపోయాయి. నిఫ్టీ దిగ్గజాలలో హీరో మోటో, బజాజ్‌ ఆటో, హిందాల్కో, ఎంఅండ్‌ఎం, జేఎస్‌డబ్లూ స్టీల్‌, యూపీఎల్‌, టాటా స్టీల్‌, ఆర్‌ఐఎల్‌, టెక్‌ మహీంద్రా, ఐషర్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌, ఐసీఐసీఐ, కోల్‌ ఇండియా, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫిన్‌ 7- 2 శాతం మధ్య క్షీణించాయి. ఇతర కౌంటర్లలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, నెస్లే, కొటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ 3.2- 0.5 శాతం మధ్య బలపడ్డాయి.

కోఫోర్జ్‌ డౌన్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో కోఫోర్జ్‌, జిందాల్‌ స్టీల్‌, మణప్పురం, హెచ్‌పీసీఎల్‌, సెయిల్‌, పీవీఆర్‌, రామ్‌కో సిమెంట్‌, జీఎంఆర్‌, టీవీఎస్‌ మోటర్‌, అశోక్‌ లేలాండ్‌, నౌకరీ, బయోకాన్‌ 8- 4 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు పీఎన్‌బీ, భెల్‌, టాటా కన్జూమర్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఐబీ హౌసింగ్‌ మాత్రమే అదికూడా 2-0.3 శాతం మధ్య పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 2-1 శాతం మధ్య నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,683 నష్టపోగా.. 998 లాభాలతో నిలిచాయి.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 907 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 892 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1,118 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,020 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement