దేశంలో ఎన్నికలు : ఈ సమయంలో బంగారంపై పెట్టుబడులు లాభాల్ని కురిపిస్తాయా? | Money Mantra: Srikanth Bhagavat And Karunya Rao About Stock Market Analysis | Sakshi
Sakshi News home page

దేశంలో ఎన్నికలు : ఈ సమయంలో బంగారంపై పెట్టుబడులు లాభాల్ని కురిపిస్తాయా?

Published Fri, Nov 3 2023 8:20 PM | Last Updated on Fri, Nov 3 2023 8:26 PM

Money Mantra: Srikanth Bhagavat And Karunya Rao About Stock Market Analysis - Sakshi

వీక్షకులకు సాక్షి మనీ మంత్రా స్వాగతం. ప్రతి వారం సాక్షి నిర్వహించే మనీ మంత్రా ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ బిజినెస్‌ కన్సల్టెంట్‌ కారుణ్యరావు, ఇతర విశ్లేషకులు రాబోయే వారంలో స్టాక్‌ మార్కెట్‌ ఎలా ఉండబోతుంది. మదుపరులు ఎలా పెట్టుబడులు పెట్టాలనే అంశాల గురించి వివరిస్తారు. 

ఎప్పటిలాగే ఈవారం సాక్షి బిజినెస్‌ కన్సట్టెంట్‌ కారుణ్యరావు, హెక్సాగన్‌ క్యాపిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ శ్రీకాంత్‌ భగవత్‌’లు గత అక్టోబర్‌ నెలలో స్టాక్‌ మార్కెట్‌లోని ఒడిదుడులు రానున్న రోజుల్లో ఎలాంటి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందనే విశ్లేషణలతో పాటు ఇతర పెట్టుబడలు గురించి విశ్లేషించారు. ఆ వివరాలేంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం.  

కారుణ్యరావు : అక్టోబర్‌ నెలలో స్టాక్‌ మార్కెట్‌లో తీవ్రమైన ఒడిదుడుకులు, పలు ఈక్విటీ విభాగాల్లో అమ్మకాలు చూశాం. యూఎస్‌లో ట్రెజరీ బిల్స్‌ సైతం పెరిగాయి.  వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని నవంబర్‌, డిసెంబర్‌ నెలలో ఫోర్ట్‌ఫోలియోని ఎలా రీబ్యాలెన్సింగ్‌, లేదంటే రివ్యూ ఎలా చేయాలి? 

శ్రీకాంత్‌ భగవత్‌ : మార్కెట్‌లో ఒడిదుడుకులు నెలకొనే అవకాశం ఉంది. కొత్తగా ఇన్వెస్ట్‌ చేసే మదుపరులు మిడ్‌ క్యాప్‌,స్మాల్‌ క్యాప్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని గత వారం సాక్షి మనీ మంత్రాలో చర్చించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాతే స్మాల్‌క్యాప్స్‌ స్టాక్స్‌ పడిపోయాయి. మిడ్‌క్యాప్స్‌, లార్జ్‌ క్యాప్స్‌లో దిద్దుబాట్లు జరిగాయి. ఇలా జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. గత ఏడాది నుంచి  అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారత్‌ మార్కెట్‌లోని పెట్టుబడిదారులు మంచి రాబడులు పొందుతున్నారు. చైనాలో పెట్టుబడులు విషయంలో ఏమాత్రం సంతృప్తిగా లేని ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్లందరికి మంచి రిటర్న్స్‌ వచ్చాయి. ప్రాఫిట్స్‌ బుకింగ్స్‌ జరిగాయి. ఆ సమయంలో అంతర్జాతీయంగా రాబడుల విషయంలో అనేక రిస్క్‌లు ఏర్పడ్డాయి. కాబట్టే భారత్‌లో పెట్టుబడులు పెట్టిన విదేశీయలు వారి పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు. భారతీయులు సైతం ఇదే పని చేశారు. గత ఏడాది కాలంలో మిడ్‌, లార్జ్‌ క్యాప్స్‌లలో 30, 35శాతం లాభం ఉంటుందని భావించారో వాటిలో కొత్త భాగాన్ని వెనక్కితీసుకుని లాభపడ్డారు. 

కారుణ్యరావు : భారత్‌లో ఎఫ్‌పీఐ ( Foreign Portfolio Investors) ఇన్వెస్టర్లు స్టాక్స్‌ని కొనుగోలు చేస్తుంటారు. కానీ ఖరీదైన కంపెనీల స్టాక్స్‌ తక్కువ ధరలో అందుబాటులో ఉండడం ఆ స్టాక్స్‌ని కంటిన్యూగా సెల్‌ చేస్తూ వచ్చారు. అలా సెల్‌ చేయడం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లను ఒత్తిడికి గురి చేశాయి. దీనితోడు యూఎస్‌ డాలర్‌ విలువ పెరగడం, వడ్డీ రేట్ల పెంపు, అక్కడి మార్కెట్‌లో మంచి లాభాలు వస్తున్న తరుణంలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఇలా కొనసాగే అవకాశం ఉందా?

శ్రీకాంత్‌ భగవత్‌ : దేశీయ మార్కెట్‌లలో విదేశీ ఇన్వెస్టర్ల స్టాక్స్‌ అమ్మకాలు తగ్గాయనే చెప్పుకోవచ్చు. కొద్దిరోజుల క్రితం ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకు నిర్ణయించింది. దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 5.25–5.5 శాతం వద్దే కొనసాగుతున్నాయి. ఉపాధి, హౌసింగ్‌ గణాంకాలు నీరసించడంతోపాటు ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్న సంకేతాలు యథాతథ పాలసీ అమలుకు కారణమైనట్లు ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ పేర్కొన్నారు. ఈ ప్రకటనతో యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంపు ఇంకొంత కాలం ఉండదు’ అని అందరూ అనుకున్నారు. కానీ ఇంకా భవిష్యత్‌లో వడ్డీ రేట్లు పెరగవనే అభిప్రాయాలతో యూఎస్‌ స్టాక్‌ మార్కెట్‌లు పెట్టుబడులు పెరిగి పాజిటీవ్‌గా కొనసాగుతున్నాయి. యూఎస్‌ అమెరికన్‌ మార్కెట్‌లో కొనుగోళ్లు పెరిగాయి. నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500, యూరప్‌ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్‌లలో కొనుగోళ్ల జరిగాయి. 

మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో ఆందోళనలో నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగానే ఉన్నారు. కాబట్టే దేశీయ స్టాక్స్‌లో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు. ఇతర మార్కెట్‌లలో ఇలాగే ఉంది. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి. 

కారుణ్యరావు :  ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. నవంబర్‌ నెల అంటే స్టాక్‌ మార్కెట్‌లో లాభాలకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా కనిపించడం లేదు. మొత్తం పాజిటీవ్‌ అవ్వొచ్చు, నెగిటీవ్‌ అవ్వొచ్చు. అసలే పండగ సీజన్‌, పైగా న్యూయర్‌ ఇలాంటి సందర్భాల్లో మదుపుర్లు పెట్టుబడుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 

శ్రీకాంత్‌ భగవత్‌ : మిడ్‌ క్యాప్స్‌లో మంచి లాభాలు ఉన్నాయంటే వాటిల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. దీంతో పాటు లార్జ్‌ క్యాప్‌ ఈక్విటీ మార్కెట్‌లో ఒడిదుడుకులు తక్కువగానే ఉన్నాయి. కాబట్టి మిడ్‌ క్యాప్స్‌, లార్జ్‌ క్యాప్‌ ఈక్విటీలను బ్యాలెన్స్‌ చేసుకోవచ్చు. మ్యాక్రో ఎకనామిక్స్‌ పరంగా భారత్‌లో సానుకూల ప్రభావం ఉన్నా రానున్న రోజుల్లో మార్కెట్‌లో అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది.  ఏడాది పొడవునా ఎన్నికలు, ఇతర సమస్యల కారణంగా మార్కెట్‌లో ఒడిదుడుకులకు అవకాశం ఉంది. డెట్‌ ఫండ్స్‌లో లాభాలు పెరుగుతున్నాయి. ఈక్వెటీ మార్కెట్‌లో లాభాల్లో ఉన్నాయి కాబట్టి.. ఈక్విటీలోని పెట్టుడుల్ని డెట్‌లో పెట్టుకోవచ్చు.    

కారుణ్యరావు : గత ఏడాది ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సమయంలో గోల్డ్‌ స్టాక్‌ ర్యాలీ బాగా జరిగింది. అయితే ఇప్పుడు గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టొచ్చా?

శ్రీకాంత్‌ భగవత్‌ : ఇప్పటి వరకు గోల్డ్‌ పెట్టుబడులు పెట్టని వారు గోల్డ్‌ విభాగంలో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. జియోపొలికల్‌ రిస్క్‌లు పెరగడం, ద్రవ్యోల్బణం పెరిగితే  గోల్డ్‌లు మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంది. సెంట్రల్‌ బ్యాంకులు సైతం ట్రెజరీస్‌ని కాపాడుకోవడం కోసం గోల్డ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారు. కాబట్టి పసిడికి మంచి డిమాండ్‌ అయితే ఉంటుంది. 

ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు, హెక్సాగన్‌ క్యాపిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ శ్రీకాంత్‌ భగవత్‌’లు అందిస్తున్న పూర్తి విశ్లేషణను ఈ వీడియోలో చూడండి

(Disclaimer:సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడి మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలువారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప..వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement