దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగింపు పలికాయి. ట్రేడింగ్ సమయంలో బ్యాంక్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ షేర్లు లాభాల్ని ఒడిసి పట్టుకుంటుంటే రియాలిటీ రంగ షేర్లు మాత్రం ఒత్తిడికి గురవుతున్నాయి.
మంగళవారం సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 261 పాయింట్ల లాభంతో 66,428 వద్ద, నిఫ్టీ 79 పాయింట్ల లాభంతో 19,811 వద్ద ముగిశాయి.
టాటా మోటార్స్,లార్సెన్,యూపీఎల్,ఇండస్ ఇండ్ బ్యాంక్, దివీస్ ల్యాబ్, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాలతో ముగియగా..బీపీసీఎల్,పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, కొటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి.
‘మార్కెట్ ట్రెండ్ వేగంగా మారుతోంది. ఇజ్రాయెల్-హమాస్ వివాదం వ్యాప్తి చెందదనే ఆశతో మదుపర్లు రిస్క్ వైపే మొగ్గు చూపుతున్నారు.ఇజ్రాయెల్- హమాస్ వివాదంలో ఇరాన్, లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా బలగాలకు పరోక్షంగా అమెరికా హెచ్చరికలు జారీ, చేస్తూ...హమాస్ దాడులతో దెబ్బతిన్న ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటన, ఇజ్రాయెల్‌కు ఆయుధ సాయం చేస్తూ అగ్రరాజ్యం విమాన వాహక నౌకను మధ్యధరా సముద్రంలో మోహరింపు వంటి పరిణామాలతో యుద్ధం వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. కాబట్టే మార్కెట్ ఆశాజనకంగా ఉంద’ని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వికె విజయకుమార్ చెప్పారు.
ఇన్వెస్టర్ల అమ్మకాలు, కొనుగోలు ఒత్తిడితో యూఎస్ యూరోప్ స్టాక్కెక్స్ 600 ఇండెక్స్, యూఎస్ ఈక్విటీలు స్తబ్ధుగా పయనించాయి. టెలికాం రంగంలో బలహీనమైన డిమాండ్ కొనసాగుతుందని స్వీడిష్ 5జీ-పరికరాల తయారీదారు హెచ్చరించడంతో ఎరిక్స్‌న్ ఏబీలో షేర్లు 9శాతం కంటే ఎక్కువ క్షీణించాయి. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ షేర్లు మంగళవారం పురోగమించాయి.
Comments
Please login to add a commentAdd a comment