లివర్‌‌పూల్‌ ఫుట్‌బాల్ క్లబ్‌పై ముఖేష్‌ అంబానీ కన్ను! | Mukesh Ambani Enters The Race To Buy Liverpool | Sakshi
Sakshi News home page

లివర్‌‌పూల్‌ ఫుట్‌బాల్ క్లబ్‌పై ముఖేష్‌ అంబానీ కన్ను!

Published Mon, Nov 14 2022 9:15 PM | Last Updated on Mon, Nov 14 2022 9:30 PM

Mukesh Ambani Enters The Race To Buy Liverpool  - Sakshi

బిలియ‌నీర్ ముకేష్‌ అంబానీ పాపులర్ ఫుట్‌‌బాల్ క్లబ్‌‌ లివర్‌‌‌‌పూల్‌‌ను కొనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు సార్లు యూఈఎఫ్‌‌ఏ ఛాంపియన్ లీగ్‌‌ విన్నర్‌‌  లివర్‌‌‌‌పూల్‌‌ ఎఫ్‌‌సీని అమ్మాలని ఈ క్లబ్ ఓనర్ యూఎస్ కంపెనీ ఫెన్‌‌వే స్పోర్ట్స్‌‌ గ్రూప్ (ఎఫ్‌‌ఎస్‌‌జీ) ప్రయాత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్లబ్‌‌ను అమ్మి పెట్టేందుకు మోర్గాన్‌‌ స్టాన్లీ, గోల్డ్‌‌మాన్ శాక్స్​ను ఎఫ్‌‌ఎస్‌‌జీ నియమించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

అయితే స్పోర్ట్స్‌ రంగంపై మక్కువతో ముకేష్‌ అంబానీ లివర్‌‌‌‌పూల్‌‌ ఎఫ్‌‌సీని కొనుగోలు చేయాలని భావిస్తున్నారంటూ ది మిర్రర్‌‌‌‌ రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఫేమస్‌‌ క్లబ్‌‌ను కొనుగోలు చేయడానికి మిడిల్ ఈస్ట్‌, యూఎస్‌‌కు చెందిన కొనుగోలు దారులతో ముఖేష్‌ అంబానీ పోటీ పడాల్సి ఉంటుంది. కాగా, ఈ ఫుడ్‌ బాల్‌ టీం రూ.38 వేల కోట్లకు అమ్మేందుకు ఓనర్లు ముందుకొచ్చినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement