రెండు నెలల్లో 81 లక్షల కొత్త ఖాతాలు ∙ఆకర్షిస్తున్న రాబడులు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ రంగంలో కొత్త ఇన్వెస్టర్ల జోరు కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి రెండు నెలల్లోనే (ఏప్రిల్, మే) మ్యూచువల్ ఫండ్స్‌లో 81 లక్షల కొత్త ఖాతాలు (ఫోలియోలు) నమోదయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) డేటాను పరిశీలించగా.. మే చివరికి నాటికి ఫోలియోలు 18.6 కోట్లకు చేరాయి. ఈ ఏడాది మార్చి చివరికి ఉన్న 17.78 కోట్ల ఫోలియోలతో పోలిస్తే 4.6 శాతం పెరిగాయి.
ఏప్రిల్‌లో 36.11 లక్షల ఫోలియోలు ప్రారంభం కాగా, మే నెలలో 45 లక్షలుగా ఉన్నాయి. 2023లో నెలవారీ సగటు నూతన ఖాతాల ప్రారంభం 22.3 లక్షలుగా ఉంది. దీంతో పోల్చి చూసినప్పుడు ఏప్రిల్, మే నెలల్లో రెట్టింపు స్థాయిలో కొత్త ఖాతాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఒక ఇన్వెస్టర్‌కు ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడిని సూచించేదే ఫోలియో. ఇలా ఒక ఇన్వెస్టర్ పలు రకాల పథకాల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒకటికి మించిన ఫోలియోలు కలిగి ఉండడం సహజం.
పెరుగుతున్న అవగాహన...
ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ అనుసరిస్తున్న పలు ప్రచార కార్యక్రమాలకు తోడు, ఈక్విటీల బలమైన ప్రదర్శన ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చి చూసినప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రాబడులు అంత ఆకర్షణీయంగా లేకపోవడం కూడా ఇన్వెస్టర్ల ధోరణిలో మార్పునకు కారణంగా పేర్కొంటున్నారు. అలాగే పెరుగుతున్న ఆదాయం, డిజిటల్ సాధనాల ద్వారా ఆరి్థక సాధనాల్లో పెట్టుబడులకు ఉన్న సౌలభ్యం వృద్ధికి అనుకూలిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
కొత్తగా వస్తున్న ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది డిజిటల్ ఛానళ్లను ఎంపిక చేసుకుంటున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏప్రిల్, మే నెలలో వచి్చన 81 లక్షల కొత్త ఫోలియోలలో 61.25 లక్షలు ఈక్విటీలకు సంబంధించినవి కావడం గమనార్హం. దీంతో పరిశ్రమ వ్యాప్తంగా మొత్తం ఈక్విటీ ఫోలియోలు 12.89 కోట్లకు పెరిగాయి. మొత్తం ఫోలియోలలో ఈక్విటీల వాటా 69 శాతంగా ఉంది. ఈ ఆరి్థక సంవత్సరం మొదటి రెండు నెలల్లో థీమ్యాటిక్/సెక్టోరల్ విభాగంలోనే 23.19 లక్షల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత స్మాల్‌క్యాప్ (8.04 లక్షలు), మిడ్‌క్యాప్ ఫండ్ (7.74 లక్షలు) విభాగాల్లో కొత్త ఖాతాల ప్రారంభం ఎక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment