![Nifty 52 week low Sensex tanks all sectors in the red - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/16/sensex%20crash.jpg.webp?itok=DUBl2_Ah)
సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం భారీ లాభాలతో ఊరించిన కీలక సూచీలు మిడ్ సెషన్‌నుంచి కనిష్ట స్థాయిలను నమోదు చేశాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో 15451వద్ద నిఫ్టీ 52 వారాల దిగువకు చేరింది. అటు సెన్సెక్స్ కూడా 52 వారాల కనిష్టానికి అతి సమీపంలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా వెయ్యి పాయింట్లు పతనమైంది.
అన్ని రంగాల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. బ్రిటానియా, మారుతి సుజుకి తప్ప సెన్సెక్స్, నిఫ్టీలలో అన్ని షేర్లు భారీగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. హిందాల్కో, టాటా స్టీల్, విప్రో, ఓఎన్‌జీసీ, సిప్లా, టెక్ మహీంద్ర, భారతి ఎయిర్‌టెల్, గ్రాసిం, ఇన్ఫోసిస్ , టైటన్ , బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment