
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ తాజా ఆల్ టైమ్ హైని తాకడంతో ఫిబ్రవరి 19న సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి.
ముగింపులో సెన్సెక్స్ 281 పాయింట్ల లాభంతో 72,708 వద్ద, నిఫ్టీ 81.60 పాయింట్ల లాభంతో 22,122 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. దాదాపు 2184 షేర్లు లాభాలు గడించగా... 1243 షేర్లు క్షీణించాయి. 123 షేర్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా టాప్ లాభాలు గడించగా, కోల్ ఇండియా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ అండ్ టీ, విప్రో హెచ్‌డీఎప్‌సీ లైఫ్ షేర్లు నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment