
ముంబై: గత మూడు రోజుల నుంచి లాభాల్లో దూసుకెళ్తున్న సూచిలకు నేడు బ్రేక్స్ పడ్డాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలు కొనలేదు. గత కొద్ది రోజుల నుంచి వచ్చిన లాభాలను మదుపర్లు వెనక్కి తీసుకోవడం, ఆసియా & యూరోప్ మార్కెట్లు కొనసాగడం, క్రిసిల్ సర్వే ఈ వృద్ధిరేటుని 7.8 శాతానికే పరిమితం చేయడం వంటి కారణాల చేత సూచీలు భారీగా నష్టపోయాయి. ముగింపులో, సెన్సెక్స్ 770.31 పాయింట్లు (1.29%) క్షీణించి 58,788.02 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 219.80 పాయింట్లు(1.24%) క్షీణించి 17,560.20 వద్ద ముగిసింది.
నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.90 వద్ద ఉంది. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, దివిస్ ల్యాబ్స్, మారుతి సుజుకి, ఐటీసీ షేర్లు ఎక్కువగా నష్టపోతే.. హెచ్‌డిఎఫ్‌సి, ఎన్‌టిపిసి, ఎస్‌బిఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లు ఎక్కువగా లాభ పడ్డాయి. ఆటో ఇండెక్స్ మినహా చమురు & గ్యాస్, ఐటీ, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1-2 శాతం నష్టాలతో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.9 శాతం పడిపోగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పడిపోయింది.
(చదవండి: భారత్‌లో లైసెన్స్ కోసం నిరీక్షణ తప్పదా?)