హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) అనుబంధ కంపెనీ అయిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తాజాగా 50 ఎలక్ట్రిక్ బస్‌ల సరఫరా ఆర్డర్‌ను చేజిక్కించుకుంది. గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (జీఎస్‌ఆర్‌టీసీ) నుంచి ఈ ఆర్డర్ దక్కింది. ఇందులో భాగంగా 10 ఏళ్ల కాలానికిగాను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో బస్‌లను 12 నెలల్లో జీఎస్‌ఆర్‌టీసీకి అందజేస్తారు.
మొత్తం ఆర్డర్ బుక్ 1,350 బస్‌లకు చేరుకుందని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎండీ కె.వి.ప్రదీప్ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో ఒలెక్ట్రా తయారీ 200 ఈ–బస్‌లు పరుగెడుతున్నాయని చెప్పారు. 9 మీటర్ల పొడవున్న ఈ బస్‌లో డ్రైవర్‌తో కలిపి 34 మంది కూర్చోవచ్చు. ఇందులోని లిథియం అయాన్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్ చేస్తే బస్ 180–200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 3–4 గంటల్లోనే చార్జింగ్ పూర్తి కావడం విశేషం.
చదవండి : రష్యాలో ప్రాజెక్టులు,15 బిలియన్ డాలర్లు దాటిన భారత్ పెట్టుబడులు
Comments
Please login to add a commentAdd a comment