వరుసగా నాలుగో విడత పెంపు | RBI to raise interest rate for 4th straight time to quell inflation | Sakshi
Sakshi News home page

వరుసగా నాలుగో విడత పెంపు

Published Mon, Sep 26 2022 6:32 AM | Last Updated on Mon, Sep 26 2022 6:32 AM

RBI to raise interest rate for 4th straight time to quell inflation - Sakshi

ముంబై: రిజర్వ్‌ బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ భేటీ ఈ నెల 28న మొదలు కానుంది. 30వ తేదీన తన నిర్ణయాలను ఎంపీసీ ప్రకటిస్తుంది. వరుసగా నాలుగో విడత ఆర్‌బీఐ రేట్ల పెంపును చేపడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కనీసం 0.40–0.50 శాతం వరకు ఈ పెంపు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది మే నుంచి ఆర్‌బీఐ మూడు విడతలుగా మొత్తం 1.4 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. దీంతో ప్రస్తుతం రెపో రేటు 5.4 శాతానికి చేరుకుంది.

ఈ ఆర్థిక సంవత్సరం చివరికి రెపో రేటు 6 శాతంగా ఉండొచ్చన్న అంచనాలు లోగడే వ్యక్తమయ్యాయి. ఒకవేళ 0.50 శాతం రేటు పెంపును ఆర్‌బీఐ చేపడితే అప్పుడు రెపో రేటు 5.9 శాతానికి చేరనుంది. వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ గరిష్ట నియంత్రిత పరి మితి అయిన 6 శాతానికి పైనే గత కొన్ని నెలలుగా చలిస్తున్న విషయాన్ని నిపుణులు తమ అంచనాలకు ఆధారంగా తీసుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement