భారత్, కెనడా మధ్య గత కొంత కాలంగా దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల ఆ దేశంలోని హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి. దీంతో హిందువులు పెద్ద ఎత్తున కెనడా రోడ్ల మీదకు వచ్చి నిరసన కార్యక్రమాలను చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. ఈ తరుణంలో 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) అక్కడ బ్యాంకింగ్ సేవలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.
కెనడాలో జరుగుతున్న ఉద్రిక్తతలు బ్యాంక్ సేవల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. కాబట్టి సంస్థ తన కార్యకలాపాలను ఎప్పటిలాగే నిర్వరిస్తుందని ఎస్‌బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడించారు. అంతే కాకుండా రెగ్యులేటరీ రెగ్యులేటర్‌లు లేదా కస్టమర్‌ల విధానంలో మేము ఎలాంటి మార్పును చూడలేదని పేర్కొన్నారు.
ఎస్‌బీఐ.. కెనడాలో టొరంటో, బ్రాంప్టన్, వాంకోవర్‌లతో సహా పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ద్వారా ఎనిమిది శాఖలను నిర్వహిస్తోంది. ఎస్‌బీఐను కూడా మేము అక్కడి స్థానిక బ్యాంకులలో ఒకటిగా భావిస్తున్నామని సీఎస్ శెట్టి అన్నారు. 1982 నుంచి ఎస్‌బీఐ కెనడాలో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment