
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే పెట్టుబడిదారుల ప్రయోజనాల పరిరక్షణకు, పారదర్శకత పెంచేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నూతన నిబంధనలు తీసుకొచ్చింది. మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలపై మరింత బాధ్యతలు మోపింది. ప్రతి అసెట్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఏఎంసీ/మ్యూచువల్ ఫండ్ నిర్వహణ సంస్థ) కొత్తగా యూనిట్ హోల్డర్ (ఇన్వెస్టర్) ప్రొటెక్షన్ కమిటీ (యూహెచ్‌పీసీ)ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఏఎంసీ నిర్ణయాలు యూనిట్ హోల్డర్ల ప్రయోజనాల కోణంలోనే ఉన్నాయా అన్నది యూహెచ్‌పీసీ పర్యవేక్షించనుంది. కొత్త నిబంధనలు జనవరి 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వ స్తాయని సెబీ శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది.
ఇవీ కొత్త మార్గదర్శకాలు
►మ్యూచువల్ ఫండ్స్ తమ నిర్వహణ ఆస్తులను పెంచుకునేందుకు తప్పుడు మార్గాల్లో పెట్టుబడులను ఆకర్షించకుండా తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా సంబంధిత మ్యూచువల్ ఫండ్ ట్రస్టీ చూడాలి.
►తమ ఉద్యోగులు, అనుబంధ సంస్థలు దుర్వినియోగానికి పాల్పడకుండా చూడాలి. మోసపూరిత లావాదేవీలు చోటు చేసుకోకుండా, ఉద్యోగులు ఫ్రంట్ రన్నింగ్‌కు పాల్పడకుండా (సంస్థ నిర్ణయాలు ముందే తెలుసుకుని ప్రయోజనం పొందడం), డిస్ట్రిబ్యూటర్లు ఆకర్షించే అంచనాలతో ఉత్పత్తులను విక్రయించకుండా తగిన చెకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి.
► ఏంఎసీలు వసూలు చేసే ఫీజులు, వ్యయాలు పారదర్శకంగా ఉండేలా ట్రస్టీలు చూడాలి.
► ఏఎంసీల పథకాల వారీగా పనితీరు, పోటీ పథకాలతో, సూచీలతో పోల్చినప్పుడు ఎలా ఉందన్నది సమీక్షించాలి.
► కేవైసీ వివరాలు సరిగ్గా లేని ఫోలియోల విషయంలో ఏఎంసీలు తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలి.
► ఈ బాధ్యతల నిర్వహణకు ఫండ్ ట్రస్టీలు ఆడి ట్, న్యాయ సేవల సంస్థలు, మర్చంట్ బ్యాంకర్లు, తదితర నిపుణుల సేవలు పొందొచ్చు.
► ఓ కంపెనీ ఫండ్ ట్రస్టీగా నియమితమైతే, చైర్‌పర్సన్‌గా ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉండాలి.
►మ్యూచువల్ ఫండ్స్ అందించే ఉత్పత్తులు, సేవలకు సంబంధించి యూనిట్ హోల్డర్ల ప్రయోజనాలకు యూహెచ్‌పీసీ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఫండ్ స్పాన్సర్లకు కొత్త నియమావళి
►మ్యూచువల్ ఫండ్‌ను స్పాన్సర్ చేసే ప్రైవేటు ఈక్విటీ సంస్థలకు కొత్త కార్యాచరణను సెబీ ప్రతిపాదించింది. ప్రైవేటు ఈక్విటీ సంస్థలకు ఫండ్ మేనేజర్‌గా కనీసం ఐదేళ్ల అనుభవం, కనీసం రూ.5,000 కోట్ల ఆస్తులను నిర్వహించి ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment