
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్ శుక్రవారం కూడా భారీ లాభాలతో కొనసాగుతోంది. సెన్సెక్స్ 500 పాయింట్లు పైగా దూసుకెళ్లగా,నిఫ్టీ 157 పాయింట్లు ఎగిసి 17087 వద్ద కొనసాగుతోంది. ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లలోను లాభాలు కొనసాగుతున్నాయి.
టాటా స్టీల్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హిందాల్కో, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు మెరుగైన ఫలితాలను ప్రకటించినప్పటికీ డా.రెడ్డీస్ 4 శాతం కుప్పకూలి టాప్ లూజర్‌గా కొనసాగుతోంది. ఇంకా సిప్లా, శ్రీసిమెంట్, సన్‌ఫార్మా,ఎస్‌బీఐ నష్టపోతున్నాయి.
అటు డాలరు మారకంలో రూపాయి భారీగా పుంజుకుంది. 46 పైసల లాభంతో 79.39 వద్ద ట్రేడ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment