సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్టు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా ఎగియగా, నిఫ్టీ 100 పాయింట్లకుపైగా లాభపడింది. ఐటీ, ఎఫ్‌ఎంసిజీ, ఫార్మా, ఆటో రంగాల లాభాతో ఆరంభంలోనే సూచీలు రికార్డు స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ 49వేలవద్ద ఆల్‌టైం గరిష్టాన్ని తాకగా, నిఫ్టీ 14400 ఎగువన నిలవడం విశేషం. ఆ తరువాత ట్రేడర్ల లాభాల స్వీకరణతో స్వల్పంగా వెనక్కి తగ్గినా, వెంటనే కోలుకుని ప్రస్తుతం 441 పాయింట్లు లాభపడి 49224 వద్ద, నిఫ్టీ 120 పాయింట్ల లాభంతో 14465 వద్ద మరోసరికొత్త దిశగా పరుగులు తీస్తున్నాయి.
ముఖ్యంగా త్రైమాసిక ఫలితాల్లో భారీ లాభాలను ప్రకటించిన ఐటీ దిగ్గజం టీసీఎస్, అవెన్యూసూపర్ మార్కెట్ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. మెరుగైన ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ఆసక్తి నెలకొంది. అటు ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్ ఒక్కొక్కటి 3 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. ఇంకా టాటా మోటార్స్, ఐటీసీ, కోల్ ఇండియా లాభపడుతున్నాయి. మరోవైపు మెటల్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. టాటా స్టీల్, హిందాల్కో, జెఎస్‌డబ్ల్యు స్టీల్‌లు 12.8 శాతం వరకు పడి పోయాయి. అలాగే ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వల్ప నష్టాలతో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment