సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. ఆరంభ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ మార్కెట్ 300 పాయింట్లకు పైగా ఎగిసింది. మద్దతు స్థాయిల వద్ద లభిస్తున సపోర్టుతో ప్రధాన సూచీలు కీలక స్థాయిలను అధిగమించాయి. సెన్సెక్స్ 280 పాయింట్లు ఎగిసి 50044 వద్ద, నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో14768 వద్ద కొన సాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, అయిల్ రంగ షేర్లు భారీగా లాభపడుతున్నాయి.
ముఖ్యంగా ఆయిల్-టు-కెమికల్స్ (ఓ2సీ) వ్యాపారాన్ని స్వతంత్ర అనుబంధ సంస్థగా రూపొందిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ మంగళవారం సంచలన నిర్ణయాన్ని తెలిపింది. 100 శాతం నిర్వహణ నియంత్రణను కలిగి ఉంటుందని ఆర్‌ఐఎల్ ప్రకటించడం విశేషం. తాజా పెట్టుబడుల వార్తలతో రిలయన్స్ 2 శాతం ఎగిసింది.
Comments
Please login to add a commentAdd a comment