
‘మ్యూచువల్ ఫండ్స్ సహీ హై’... ఎక్కడో విన్నట్టు ఉంది కదూ..? టీవీ సీరియళ్ల మధ్యలో ప్రకటనలు.. పత్రికల్లో, వార్తా చానళ్లలో వచ్చే ప్రకటనల్లో.. సెలబ్రిటీలు దర్శనమిచ్చి చేస్తున్న కొటేషన్ ఇది. ‘మ్యూచువల్ ఫండ్స్ సరైనవే..’అని దీని అర్థం. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ చేస్తున్న విస్తృత ప్రచార కార్యక్రమంలోభాగమే ఇది. కానీ, ఆచరణలో అది ప్రతిఫలిస్తోందా..? అని ప్రశ్నిస్తే.. జవాబు వెతుక్కునే ముందు చూడాల్సిన గణాంకాలు కొన్ని ఉన్నాయి.
మ్యూచువల్ ఫండ్స్ అనేవి దీర్ఘకాలానికి అని ప్రముఖంగా చెబుతుంటారు కనుక.. దీర్ఘకాలానికి నిఫ్టీ, నిఫ్టీ టీఆర్‌ఐ సూచీలతో పోలిస్తే డైవర్సిఫైడ్ ఫండ్స్ పనితీరును విశ్లేషించి చూడాలి. ఏటా జనవరి మొదటి ట్రేడింగ్ రోజున కొనుగోలు చేసి 2020 డిసెంబర్ వరకు కొనసాగించి ఉంటే, నిఫ్టీ రాబడుల తీరు ఎలా ఉందీ.. ఈ కాలంలో ఎన్ని పథకాలు ప్రారంభమయ్యాయి.. అదే సమయంలో ఎన్ని నిఫ్టీతో పోలిస్తే మంచి పనితీరు చూపించాయన్నది ఈ గణాంకాల్లో చూడొచ్చు..
ఈటీఎఫ్‌లను
ఎందుకు నమ్ముకోకూడదు?
నిఫ్టీ ఇండెక్స్‌లోని స్టాక్స్‌లోనే పెట్టుబడులు పెడుతూ సూచీలను అనుకరించే ఈటీఎఫ్‌లో ఎక్స్ఛ్‌పెన్స్ రేషియో (ఫండ్స్ నిర్వహణ చార్జీలు) చాలా తక్కువకే, ఈక్విటీ పథకాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉంటున్నప్పుడు.. సాధారణ ఈక్విటీ పథకాలనే ఎందుకు ఆశ్రయించడం? ఎందుకంటే మన దేశంలో ఫండ్స్ పథకాలు ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా విక్రయించబడుతున్నవే. వారికి ట్రయల్ కమీషన్ ముడుతుంటుంది.
మ్యూచువల్ ఫండ్స్ సహీ హై కాదా?
నిఫ్టీ, నిఫ్టీ టీఆర్‌ఐను మించి ఎక్కువ సందర్భాల్లో అధిక రాబడులను ఇచ్చే మెరుగైన విధానాలున్నాయి. ఫండ్స్ పథకాల పనితీరును ఎటువంటి పక్షపాతం లేకుండా పరిశీలించి, తగిన సామర్థ్యం కలిగిన పథకాలను ఎంచుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించొచ్చు. అయితే నిపుణుల సహకారం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కాకపోతే కొంత ఫీజు రూపంలో ఇందుకు సంబంధించి చెల్లించేందుకు సిద్ధపడాలి.
ప్రసాద్ వేమూరు
– సీఎండీ, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్
Comments
Please login to add a commentAdd a comment