దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ట్రేడ్ అయిన దేశీయ ప్రామాణిక సూచీలు వారంతపు ట్రేడింగ్ సెషన్‌ను ప్రతికూలంగా ముగించాయి. అన్ని రంగాలలో అమ్మకాలు జోరందుకోవడంతో నష్టాలు తప్పలేదు.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 808.65 పాయింట్లు లేదా 0.98 శాతం క్షీణించి 81,688.45 వద్దకు చేరుకుంది. అలాగే నిఫ్టీ 50 కూడా శుక్రవారం 200.25 పాయింట్లు లేదా 0.79 శాతం పడిపోయి 25,049.85 వద్ద స్థిరపడింది.
నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 37 స్టాక్‌లు నష్టాల్లో ముగిశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, బీపీసీఎల్, హీరో మోటోకార్ప్ భారీగా నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment