తొలి ఏడాది మొదటి వారం చివరి రోజు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తోంది స్టాక్‌మార్కెట్ ! క్షణ క్షణానికి లాభ నష్టాల మధ్య అటు ఇటు మారుతూ పల్స్ రేటు పెంచుతోంది. ముఖ్యంగా ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఉన్న వారైతే బీపీ మాత్రలు వేసుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తోంది.
డిసెంబరులో
డిసెంబరులో బేర్ పట్టులో చిక్కుకుంది స్టాక్ మార్కెట్. దీంతో జీవిత కాల గరిష్టాలను క్రమంగా కోల్పోతూ వచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 62,245 పాయింట్ల నుంచి క్రమంగా పాయింట్లూ కోల్పోతూ డిసెంబరు 20 ఏకంగా 55,822 పాయింట్లకు పడిపోయింది. మరోవైపు నిఫ్టీ సైతం 18,604 పాయింట్ల గరిష్టాన్ని అందుకుంది కానీ క్రమంగా పాయింట్లు కోల్పోతూ 16,614కి పడిపోయింది. ఇలా డిసెంబరు అంతా నష్టాలతో ముగిసిన మార్కెట్ జనవరి 3న లాభాలతో ప్రారంభమై... అదే ఊపు కొనసాగించలేక 6న నష్టాలలతో ముగిసింది.
ప్రతీ క్షణం ఉత్కంఠ
జనవరి 7న మార్కెట్ ఉదయం లాభాలతో మొదలైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ సూచీ క్రమంగా లాభపడుతూ పాయింట్లూ పెరుగుతూ పోయింది. ట్రేడింగ్ మొదలైన గంటకే గంటకే దాదాపు 400కు పైగా పాయింట్లు లాభపడి 60 వేలు క్రాస్ చేసి ఈ రోజు గరిష్టం 60,130 పాయింట్లను టచ్ చేసింది. దీంతో వెంటనే ఇన్వెస్టర్లు తక్షణ లాభాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించడంతో వేగంగా పాయింట్లూ కోల్పోవడం ప్రారంభించింది. మధ్యాహ్నం సమయంలో ఆరంభ లాభాలు మొత్తం ఆవిరి చేస్తూ దాదాపు 500లకు పైగా పాయింట్లు కోల్పోయి 59,401 పాయింట్లకు పడిపోయింది. ఇంచు మించు ఇదే ట్రెండ్ నిఫ్టీలోనూ కనిపించింది. నిఫ్టీ 17,905 గరిష్టం నుంచి 17,704 పాయింట్లకు పడిపోయింది.
మళ్లీ లాభాలు
మధ్యాహ్నం 1 గంట తర్వాత మార్కెట్ మరోసారి పుంజుకోవడం ప్రారంభించింది. స్టాక్స్ ధర అందుబాటులో ఉండటంతో ఇన్వెస్టర్లు మరోసారి మార్కెట్‌పై నమ్మకం చూపించారు. దీంతో క్రమంగా సెన్సెక్స్, నిఫ్టీలు పుంజుకుని నష్టాల నుంచి బయటపడ్డాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 17,791 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 67 పాయింట్లు 59,668 దగ్గర కొనసాగుతోంది. క్షణక్షణానికి ఆధిపత్యం మారుతుండటంతో ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఉన్న ఇన్వెస్టర్లు తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment