దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 238 పాయింట్లు నష్టపోయి 22,515 వద్దకు చేరింది. సెన్సెక్స్ 793 పాయింట్లు దిగజారి 74,244 వద్దకు చేరింది. యూఎస్ సీపీఐ ద్రవ్యోల్బణ డేటా అంచనాలకు మించి 3.5 శాతంగా నమోదవడంతో మార్కెట్ కుప్పకూలినట్లు నిపుణులు చెబుతున్నారు.
సెన్సెక్స్ 30 సూచీలో టాటామోటార్స్, టీసీఎస్, నెస్లే, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ మినహా అన్ని కంపెనీ షేర్లు నష్టాల్లోనే ముగిశాయి.
విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) బుధవారం నికరంగా రూ.2,778.17 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐలు) రూ.163.36 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment