దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:20 వరకు నిఫ్టీ 179 పాయింట్లు దిగజారి 21,566కు చేరింది. సెన్సెక్స్ 610 పాయింట్లు నష్టపోయి 70,940వద్ద ట్రేడవుతోంది.
ఎఫ్‌ఐఐలు మంగళవారం ఈక్విటీ మార్కెట్‌లో రూ.376.32 కోట్లు, డీఐఐలు రూ.273.94 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అమెరికా సీపీఐ డేటా మార్కెట్ అనుకున్నదానికంటే ఎక్కువ రావడంతో ఈసారి వచ్చే ఫెడ్ మీటింగ్‌లో కీలక వడ్డీరేట్లను తగ్గించరేమోనని భావించి అక్కడి మార్కెట్లు భారీగా దిగజారాయి. కొన్ని రోజులుగా ద్రవ్యోల్బణంకు సంబంధించి నెలకొంటున్న పరిణామాలతో ఇకపై వడ్డీరేట్లను తగ్గించేయోచనలో లేనట్లు మార్కెట్లు భావిస్తున్నయని తెలుస్తుంది. యూఎస్ బాండ్ ఈల్డ్‌లు 4.32 శాతానికి చేరాయి.
మార్కెట్లు ఈ మధ్యకాలంలో భారీగా ఒడిదొడుకులకు లోనవుతోందని తెలుస్తుంది. అయితే ఇలాంటి సమయంలో కొత్తగా మార్కెట్‌లోకి వచ్చినవారు నష్టభయాన్ని తట్టుకోలేక లాస్‌బుక్ చేస్తుంటారు. కానీ స్టాక్ ఫంటమెంటల్స్పై పూర్తి అవగాహన ఉండి బిజినెస్ మోడల్‌పై పట్టు ఉంటే దీర్ఘకాలికంగా మంచి లాభాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment