దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 22,089కు చేరింది. సెన్సెక్స్ 188 పాయింట్లు పుంజుకుని 72,916 వద్ద ట్రేడవుతోంది.
డాలర్ ఇండెక్స్ 103.39 పాయింట్లకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 85.15 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఎస్‌పీఎక్స్ 0.29 శాతం, నాస్‌డాక్ 0.3 శాతం నష్టపోయాయి.
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గి, 0.2 శాతంగా నమోదయ్యింది. డిసెంబర్‌లో ఈ రేటు 0.27 శాతంగా ఉంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ టోకు ధరల సూచీ మైనస్ (ప్రతి ద్రవ్యోల్బణం)లో ఉంది. నవంబర్‌లో ప్లస్‌లోకి మారి 0.26 శాతంగా నమోదయ్యింది. అయితే ఆహార ధరలు మాత్రం ఫిబ్రవరిలో స్వల్పంగా పెరిగాయి.
సెబీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి స్ట్రెస్ టెస్ట్ డేటాను ఈరోజున రానుంది. దాంతో ఫండ్స్‌లోని నిధులు ఏమేరకు వచ్చాయి. ఎలా వచ్చాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు.. వంటి అనేక అంశాలను పరిగణిస్తూ రిపోర్ట్ వెలువడనుంది. అయితే ఇప్పటికే చాలామంది ఇన్వెస్టర్లు వారి పోర్ట్‌ఫోలియోలోని మ్యూచువల్‌ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్లను అమ్మేసినట్లు తెలిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment