దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 24,360కు చేరింది. సెన్సెక్స్ 156 పాయింట్లు లాభపడి 80,127 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 104.98 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 85.7 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.1 శాతం, నాస్‌డాక్ 0.3 శాతం లాభపడ్డాయి.
గడిచిన కొన్నేళ్లలో కంపెనీల వృద్ధి కంటే ఈక్విటీ రాబడులే అధికంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. కాబట్టి దీనికి విరుద్ధమైన పరిస్థితికి ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు కేటాయించిన పెట్టుబడులు రిస్క్‌ను అధిగమించేందుకు తోడ్పడతాయన్నారు. అంతర్జాతీయంగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా సెనెట్, ప్రజా ప్రతినిధుల సభల్లో కీలక ప్రసంగం(మంగళ, బుధవారం), యూఎస్, చైనా జూన్ ద్రవ్యోల్బణ డేటా, బ్రిటన్ మే జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment