ఫ్లాట్‌గా కదలాడుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా కదలాడుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Thu, Jul 11 2024 9:47 AM | Last Updated on Thu, Jul 11 2024 11:04 AM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 24,348కు చేరింది. సెన్సెక్స్‌ 53 పాయింట్లు లాభపడి 79,974 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 104.96 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 84.86 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 1.02 శాతం, నాస్‌డాక్‌ 1.2 శాతం  లాభపడ్డాయి.

మార్కెట్‌ గరిష్టాల వద్ద మదుపర్లు భారీగా అమ్మకాలు చేశారు. దాంతో బుధవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇటీవల బాగా పెరిగిన లోహ, వాహన, ఐటీ షేర్లకు లాభాల స్వీకరణ ఎదురైంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల కోతలపై అనిశ్చితి పెరగడంతో అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా మారాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు తగ్గి 83.51 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.24% లాభంతో 84.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్‌ నష్టపోగా, సియోల్, టోక్యో లాభపడ్డాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement