దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:47 సమయానికి నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 24,862కు చేరింది. సెన్సెక్స్ 94 పాయింట్లు పుంజుకుని 81,447 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 104.56 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79.84 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.17 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.08 శాతం, నాస్‌డాక్ 0.07 శాతం లాభపడ్డాయి.
అమెరికా ఫెడరల్ ద్రవ్య విధాన నిర్ణయాల వెల్లడి ముందు ఈక్విటీ మార్కెట్లో అప్రమత్తత చోటు చేసుకుంది. నిన్నటి మార్కెట్ సెషన్‌లో ఇంట్రాడేలో 576 పాయింట్లు బలపడి 81,908 వద్ద, నిఫ్టీ 165 పాయింట్లు ర్యాలీ చేసి 25 వేల పాయింట్ల మైలురాయికి అత్యంత చేరువలో 24,999.75 వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. ఈ వారంలోనే అమెరికా, బ్రిటన్, జపాన్ కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లపై నిర్ణయాలను వెల్లడించనున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో
కదలాడుతున్నాయి.
నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు
అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలకు సంబంధించి సవరించిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు సెబీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థల్లో ఫ్రంట్ రన్నింగ్ ఆరోపణలు వస్తుండడం తెలిసిందే. ఈ తరహా కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు వీలుగా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల క్రయ, విక్రయాలను సైతం ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనల పరిధిలోకి సెబీ తీసుకొచ్చింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment