దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ 279 పాయింట్లు పెరిగి 24,275కు చేరింది. సెన్సెక్స్ 850 పాయింట్లు పుంజుకుని 79,448 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 103 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 76.19 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.9 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.04 శాతం, నాస్‌డాక్ 1.03 శాతం లాభపడ్డాయి.
గడిచిన మూడు సెషన్‌ల్లో మార్కెట్ భారీగా పడింది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారు ఎలాంటి భయాలకు లోనుకాకుండా వాటిని కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ ఇలా భారీగా పతనమైనపుడు క్వాలిటీ స్టాక్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు సంపాదించవచ్చని చెబుతున్నారు. భారత్ ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న దేశం. మార్కెట్‌లోని ఒడిదొడుకులను ఒక అవకాశంగా తీసుకుని మంచి స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే మరిన్ని లాభాలు సొంతం చేసుకోవచ్చని అంటున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment