దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ 254 పాయింట్లు పెరిగి 24,376కు చేరింది. సెన్సెక్స్ 846 పాయింట్లు పుంజుకుని 79,737 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 103.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.98 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 2.3 శాతం, నాస్‌డాక్ 2.88 శాతం లాభపడ్డాయి.
గురువారం రాత్రి అమెరికా జాబ్స్‌డేటా విడుదలైంది. గత వారంతో పోలిస్తే అంచనాల కంటే తక్కువ ఉద్యోగాలు చేరడంతో ఎకానమీ మరింత దిగజారిపోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. దాంతో సెప్టెంబర్‌లో రానున్న యూఎస్ ఫెడ్ సమావేశంలో కీలక వడ్డీ రేట్ల కోత ఉంటుందని మార్కెట్లు భావిస్తున్నాయి. ఇటీవల భారీగా నష్టపోయిన యూఎస్ టెక్ ఇండెక్స్ నాస్‌డాక్ గురువారం పుంజుకుంది. ఎన్‌వీడియా, బ్రాడ్‌కామ్ స్టాక్‌లు 6 శాతం, మెటా 4.2 శాతం, యాపిల్ 1.7 శాతం పుంజుకున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment