దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 24,667కు చేరింది. సెన్సెక్స్ 164 పాయింట్లు నష్టపోయి 80,651 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 101.39 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 77.16 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.81 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.2 శాతం, నాస్‌డాక్ 0.33 శాతం నష్టపోయాయి.
స్టాక్‌మార్కెట్ రేటింగ్ ఏజెన్సీ గోల్డమన్‌సాక్స్ ఇటీవల అమెరికా మార్కెట్ ఆర్థికమాంద్యంలోకి వెళుతుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. అదే సంస్థ తాజాగా మాంద్యం రాకపోవచ్చని చెప్పడంతోపాటు యూఎస్ మార్కెట్ గరిష్ఠాలను చేరే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం జపాన్ జులై ద్రవ్యోల్బణ డేటా పాటు భారత ఆర్‌బీఐ ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. మార్కెట్ ఈ డేటాను పరిశీలించనుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment