దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 24,829కు చేరింది. సెన్సెక్స్ 212 పాయింట్లు లాభపడి 81,109 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 101.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 76 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.81 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.4 శాతం, నాస్‌డాక్ 0.6 శాతం లాభాపడ్డాయి.
స్టాక్‌మార్కెట్ రేటింగ్ ఏజెన్సీ గోల్డమన్‌సాక్స్ ఇటీవల అమెరికా మార్కెట్ ఆర్థికమాంద్యంలోకి వెళుతుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. అదే సంస్థ తాజాగా మాంద్యం రాకపోవచ్చని చెప్పడంతోపాటు యూఎస్ మార్కెట్ గరిష్ఠాలను చేరే అవకాశం ఉందని తెలిపింది. సెప్టెంబర్‌లో రాబోయే ఫెడ్ సమావేశంలో కీలక వడ్డీరేట్లను 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment