దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:49 సమయానికి నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 24,976కు చేరింది. సెన్సెక్స్ 531 పాయింట్లు లాభపడి 81,605 వద్ద ట్రేడవుతోంది. ఈ నెల 1వ తేదీన నిఫ్టీ జీవితకాల గరిష్ఠం 25,075 పాయింట్లను చేరింది. ఇటీవల కొంత నష్టాల్లోకి వెళ్లిన మార్కెట్లు క్రమంగా పెరుగుతూ తిరిగి మునుపటి గరిష్ఠ మార్కు దరిదాపుల్లోకి చేరుతున్నాయి.
అమెరికా డాలర్ ఇండెక్స్ 100.58 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.77 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.15 శాతం, నాస్‌డాక్ 1.47 శాతం లాభపడ్డాయి.
సెప్టెంబర్‌లో జరగబోయే ఫెడ్ సమావేశంలో కీలక వడ్డీరేట్లను 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. వారాంతాన(30న) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసిక(ఏప్రిల్–జూన్) జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. జులై నెలకు సంబంధించి మౌలిక సదుపాయాల రంగ వివరాలు సైతం వెల్లడికానున్నాయి. ఈ అంశాలకుతోడు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలరు మారకంతో పోలిస్తే రూపాయి కదలికలు మార్కెట్లను ప్రభావితం చేయగలవని అంచనా.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment