దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ 177 పాయింట్లు తగ్గి 25,102కు చేరింది. సెన్సెక్స్ 537 పాయింట్లు నష్టపోయి 82,011 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 101.8 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.82 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 2.12 శాతం, నాస్‌డాక్ 3.26 శాతం నష్టపోయాయి.
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ సమావేశం సెప్టెంబర్ 17-18 జరగనుంది. ఈ నేపథ్యంలో ఫెడ్ వడ్డీరేట్లను ప్రభావితం చేసే యూఎస్ తయారీ రంగ, నిరుద్యోగ రేటు, వ్యవసాయేతర పేరోల్ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఈరోజు మార్కెట్ ప్రారంభం నుంచి ఐటీ స్టాక్స్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టాల్లో ఉన్నా కొంత నిలకడగానే ట్రేడవుతున్నాయి. ఫార్మా స్టాక్స్ కొంత లాభాల్లోకి చేరుకున్నాయి. స్టీల్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment